వి(స్వ)పక్షం.. ఎవరి పక్షం..?
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందనేది మనందరికీ తెలిసిందే. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందకపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ తన వాణిని వినిపిస్తుంది. ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ వ్యూహాత్మకంగా ప్రజల మెప్పు కోసం విపక్ష నేతలు తహతహలాడుతుంటారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు (లబ్ది) కోసం పునాదులు వేసుకుంటూ ప్రజలు హర్షించే విధంగా రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంటారు. రాజకీయ చదరంగంలో పావులు కదుపుతుంటారు. ప్రజల యోగ క్షేమాలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంకన్నా ప్రతిపక్షానికే…