విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించిన జనసేన
బీజేపీకి కటీఫ్ చెప్పేందుకే నిర్ణయం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ కదిలారు. వారంలోగా అఖిల పక్ష సమావేశం వేయకుంటే అధికార వైసీపీ బోనులో దోషిగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవడం ఏమిటని నిలదీశారు. కేవలం లేఖలు రాస్తే పనికాదన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జనసేన పార్టీ వైఖరి ఏంటో తేటతెల్లం చేశారు.
సీఎం జగన్ తల్చుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోతుందని పవన్ వెల్లడించారు. బంతిని వైసీపీ కోర్టులోకి విసిరారు. విశాఖ ఉక్కును అమ్మేయాలని నిర్ణయించుకున్న కేంద్ర నిర్ణయంపై అధికార పార్టీ దాగుడుమూతలకు అవకాశం లేదు. ఉత్తరాంధ్రను స్టీల్ ప్లాంటు విషయం చాలా ప్రభావితం చేస్తుంది. దీనిపై వైసీపీ ఏం చేయదల్చుకుందో స్పష్టం చేయాల్సిన పరిస్థితి ముందుకొచ్చింది. స్టీల్ ప్లాంటు అమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతే ఉత్తరాంధ్రలో బలహీనపడుతుంది. గతంలో మాదిరిగా రాష్ర్టంలో తాము ఉక్కు అమ్మకానికి వ్యతిరేకమంటూ కేంద్రంలో నిలదీయలేని బేలతనం ఇప్పుడు కుదరదు.
మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం ద్వారా బీజేపీ దోస్తీకి కటీఫ్ చెప్పాలని జనసేనాని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈపాటికే బీజేపీ, జనసేన పార్టీ శ్రేణుల్లో కలివిడి లేదు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక నాటి నుంచే ఇరు పక్షాల నేతలు పరసర ఆరోపణలకు దిగారు. బీజేపీ వల్ల తాము నష్టపోయినట్లు జనసేన నేతలు వాపోతున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష టీడీపీ గొంతు పెగలదు. స్టీల్ ప్లాంటు విషయంలో ఛాంపియన్ కావడం ద్వారా ఉత్తరాంధ్రలో బలపడాలని జనసేన భావిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై టీడీపీ పోరాడలేదని పవన్ అనంతపురం జిల్లా పర్యటనలో చెప్పారు. రాష్ర్టంలో ప్రతీ సమస్యపై ఉద్యమిస్తూ జనసేన ప్రధాన ప్రతిపక్షపార్టీ పాత్ర పోషిస్తుందన్నారు.
పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలపై కేంద్రంతో పవన్ కొట్లాడడంలేదు. రైల్వే స్టేషన్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు అమ్మేస్తున్నా మౌనంగా ఉన్నారు. రాష్ర్ట ప్రజలపై పెనుభారం మోపే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నప్పుడూ జనసేనానిలో స్పందన లేదు. మన జీవనదులపై కేంద్రం పెత్తనమేంటని ఏనాడూ ప్రశ్నించలేదు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్ర సర్కారు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నా ఏనాడూ నిలదీయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పిన పవన్ కల్యాణ్ ను ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారో వేచి చూడాల్సిందే.
అమిత్ షా అపాయిన్ట్మెంట్ ఇవ్వాలంటే,
ఇక్కడ మీరు నాయకునిగా ఎదగాలి.
నాయకునిగా ఎదగాలంటే,
విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ ఉద్యమం ఉదృతం చేయండి.
ప్రయివేటీకరణ ఆపండి.
వైసిపి ….తెదేపా…చేయలేని పని మీరు చేయండి.
జనం మీవైపే ఉంటారు. మీదే అధికారం.
తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టండి చూద్దాం.
మీ కార్యకర్తలతో పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించండి.
గతంలో రహదారుల గుంతలు ఫొటోలు తీసి,
సోషల్ నెట్వర్కింగ్ లో ఉంచి ప్రభుత్వ వైఫల్యం ప్రజల ముందు పెట్టారు. సూపర్! !
ఊకదంపుడు ఉపన్యాసాలు అనవసరం.
మీ ఉపన్యాసాలు వింటుంటే ఆవు కధ గుర్తుకు వస్తుంది.
పవన్ ని విమర్శిస్తే ఊగిపోతూ బాబులు తిడితే ఉపయోగం ఉండదు.
nice comment
చంద్రబాబుకి బీజేపీ అపోయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి పవన్ కి కోపమొచ్చినట్లుంది. అందుకే అంత గట్టిగా మాట్లాడి బంతిని వైసీపీ కోర్టులో విసిరాడు. నెక్స్ట్ జగన్ స్టెప్ ఏంటో చూడలిమరి
WELL SAID