జైభీమ్ చిత్రం నన్ను కలచివేసింది
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్జైభీమ్చిత్రంపై స్పందించారు. నిజజీవితంలో రాజకన్ను భార్య పార్వతి నాడు అనుభవించిన కష్టాలను తమిళంలో సెంగాని పాత్రలో చూస్తున్నంత సేపు హృదయం బరువెక్కిందని పేర్కొన్నారు. భర్తను కోల్పోయి ప్రస్తుతం పేదరికంలో మగ్గిపోతున్న పార్వతికి తన సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ ప్రకటించారు. తమిళ యూ ట్యూబ్ చానల్ ‘‘వలైపెచ్చువాయిస్”తో రాఘవ తనను జైభీమ్చిత్రంగా ఆకట్టుకుందో వెల్లడించారు. 1990వ దశకంలో న్యాయవాది చంద్రు నిజ జీవితాన్ని అద్భుతంగా తెరపైకి ఎక్కించిన దర్శకుడు జ్ఞానవేల్‌ను అభినందించారు. స్టార్డమ్వదులుకొని చంద్రు పాత్రకు నటుడు సూర్య జీవం పోసినట్లు తెలిపారు. రాజాకన్ను పాత్రలో మణికందన్ ఒదిగిపోయినట్లు పేర్కొన్నారు. ఓ దొంగతనం కేసులో ఇరులర్గిరిజన జాతికి చెందిన రాజకన్నును అరెస్టు చేయడం, లాకప్‌లో కొట్టి చంపే దృశ్యాలు, న్యాయం కోసం నిలిచిన రాజకన్ను భార్య సెంగాని నటన హృదయాలను కరిగించేస్తోందని చెప్పారు. ఈపాటికే రాఘవ లారెన్స్చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో లక్షల మందికి ఉచితంగా ఆహారం, నిత్యావసరాలు అందించారు. జైభీమ్ చిత్రంపై టాలీవుడ్, కోలీవుడ్‌లో మొట్టమొదట స్పందించిన నటుడు రాఘవ లారెన్స్ కావడం విశేషం.