కడప నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. బుగ్గవంక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగరాజుపేట, రవీంద్రనగర్, బాలాజీ నగర్, కాగితాల పెంట, మరాఠీ వీధి , మురాద్ నగర్, గుర్రాలగడ్డ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉపముఖ్యమంత్రి అర్థరాత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షించారు.
