ప్రకృతిలో సముద్రానికి.. బ్యాక్ వాటర్‌కు మధ్య జరిగే సహజసిద్దమైన బ్యాలెన్సింగ్ మెకానిజం అద్భుతంగా ఉంటుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఒంగోలు సమీపంలోని పాత బకింగ్ హామ్ కెనాల్ నిండు కుండలా మారింది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు తమిళనాడులోని విల్లుపురం నుంచి చెన్నై హార్బర్ మీదుగా కాకినాడ వరకు తవ్వించిన ఈ “బకింగ్ హామ్” కెనాల్ ను జలరవాణాకు విరివిగా ఉపయోగించేవారు. కాలక్రమేణా ఆ కెనాల్ ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది.
సరకుల రవాణాకు రోడ్డు మార్గంలో కిలోమీటరుకు రూ.5 ఖర్చయితే జలమార్గంలో కేవలం రూపాయి మాత్రమే అవుతుంది. ఎన్డీయే ప్రభుత్వం ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ పేరుతో ఈ కాలువను అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. దీనికి కృష్ణా, గోదావరి నదుల నుంచి అనుసంథానం చేయాలని భావించింది. కానీ పనుల్లో పురోగతి లేదు. నిధులూ అంతంత మాత్రంగానే కేటాయించారు. ఆక్రమణలు తొలగించి ఈ కాలువను అభివృద్ధి చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.
స్థానికంగా వివిధ పేర్లతో పిలిచే బకింగ్‌హామ్ కాలువను ఒంగోలు సమీపంలో ఉప్పుకాలువ, ఉప్పు వాగని పిలుస్తారు. సాధారణంగా పౌర్ణమి రోజున సముద్రంలో వచ్చే ఆటుపొట్లతో నీరు ఈ కాలువలో కలుస్తుంటుంది. సముద్రం నుంచి వచ్చే ఆ ఉప్పునీటి ద్వారానే పెద్ద ఎత్తున ఉప్పు పండిస్తారు. వరదలు, తుఫాన్ల సమయంలో బకింగ్ హామ్ కెనాల్ అడ్డుగోడలా నిలుస్తుంది. ఈరోజు ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని బకింగ్‌హామ్ కెనాల్ పై ఈ అందమైన దృశ్యం నా ఫోన్ లెన్స్ కి దొరికింది.
courtesy by – చల్లా శ్రీధర్‌రెడ్డి