స్విమ్స్‌కు రోబో బహూకరణ
శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ ఓ రోబోను రూపొందించి స్విమ్స్‌కు బహూకరించారు. దీని కోసం రూ.50 వేల ఖర్చు పెట్టారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదగా రోబోను స్విమ్స్‌కు అందజేశారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కాలంలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు రోబోలు బాగా ఉపయోగపడతాయన్నారు. ఇంకా విశ్వ విద్యాలయంలో కొత్తగా నిర్మించిన కేఎల్ రావు భవనం, ఆడిటోరియం, లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్,…