గెలవడమంటే.. ప్రేమతో, మనసును గెలవడం !
న్యాయ విచారణకు సంబంధించి ఓ కేసులో గెలుపోటములు సహజం. గెలవడమంటే తీసుకున్న ఫీజుకు న్యాయం చేయడం కాదు. ప్రేమతో మనసులను గెలవడమని ‘సప్తగిరి ఎల్ఎల్బీ’చిత్రం చెబుతోంది. దొంగ సాక్ష్యాలతో కేసులను తప్పుదోవ పట్టించి న్యాయానికి పాతరేసే న్యాయవాదులకు కనువిప్పు కలిగించేలా ఈ చిత్రం అద్భుత సందేశాన్నిస్తోంది. అప్పుడే న్యాయవాద వృత్తిలోకి వచ్చిన సినిమా హీరో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి పక్షాన వాదించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. సినిమా మొదటి పార్టులో కొంత క్యామెడీ పండించినా రెండో భాగం సీరియస్‌గా నడుస్తుంది.
మీకు అన్నం పెట్టే రైతుల్ని చంపొద్దు. మీరు చంపుతున్నా మేమేం అనలేం. మమ్మల్ని బతకనివ్వండంటూ ఓ రైతుగా ఎల్బీ శ్రీరాం డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆదుకుంటాయి. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సప్తగిరి ఎల్ఎల్బీ పూర్తి చేస్తాడు. గ్రామంలో ఓ సమస్యను పరిష్కరిస్తాడు. జిల్లా కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నా అంతగా కేసులు రాకపోవడంతో మరదల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. దీంతో హైదరాబాద్ మకాం మారుస్తాడు. హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభిస్తాడు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఐదుగురు మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం కేసును చేపడతాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది.

ఈ కేసును ప్రముఖ లాయర్ రాజ్‌పాల్(సాయికుమార్) టేకప్ చేస్తారు. ఓ పారిశ్రామిక వేత్త కుమారుడు మద్యం మత్తులో ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న ఐదుగురిపై కారు ఎక్కిస్తాడు. అందులో నలుగురు అక్కడకక్కడే చనిపోతారు. అందులో హనుమంతుదాస్ గాయాలతో బయటపడతాడు. చనిపోయిన వాళ్లంతా యాచకులుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ కేసును యాచకుల తరపున సప్తగిరి కేసు మూవ్ చేస్తాడు. ఇది గమనించిన లాయర్ రాజ్‌పాల్ తన మనుషులను పంపి కేసు విత్ డ్రా చేసుకోకుంటే చంపేస్తామని బెదిరిస్తాడు. కేసు వాపస్ తీసుకున్నందుకు రూ.4 లక్షల నగదు, 16 లక్షల కారు దక్కుతాయి. దీనిపై సప్తగిరి మరదలు నిలేస్తుంది. లంచానికి అమ్ముడుపోయిన లాయర్ అంటే అసహ్యమని చెబుతుంది. డబ్బును గుడిమెట్లపై యాచకులకు పంచేస్తాడు. కారును ధ్వంసం చేస్తాడు. కేసును మళ్లీ కేసును వాదించడానికి సిద్దమవుతాడు.
ఇక్కడ నుంచి కథ కీలకమలుపు తిరుగుతుంది. చనిపోయింది యాచకులు కాదు.. రైతులని రోడ్డు పక్కన ఉండే యాచకులు చెబుతారు. దీంతో హతాశుడైన సప్తగిరి రైతుల అడ్రస్ పట్టుకొని అదిలాబాద్ జిల్లాలోని మారుమూలపల్లెకు చేరుకుంటాడు. ఆరుగురిలో బతికిన హనుమంతు దాస్ గురిచంఇ వాకబు చేస్తాడు. అక్కడ రైతులు సప్తగిరిని నమ్మరు. నిందితుల తరపున వచ్చిన రౌడీలతో అక్కడ సప్తగిరి ఫైట్ చేస్తాడు. దీంతో హనుమంతుదాస్తో హనుమంతుదాస్ను పంపిస్తారు. చివరగా కోర్టు సీను బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. జడ్జి పాత్రను శివప్రసాద్ పోషించారు. ఈ కేసులో చనిపోయిన రైతు కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున పరిహారం చెల్లించడంతోపాటు ముద్దాయికి యావజ్జీవ ఖైదు విధిస్తారు.
చివరి కోర్టు సీనులో సప్తగిరి వాదన ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. ఆలోచింపజేస్తుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమైన మద్యపానాన్ని ప్రభుత్వాలు ఎందుకు నిషేధించవని అడుతాడు. ప్రభుత్వాలు నడవడానికి మద్యం ఆదాయమే కీలకం కావడం ప్రజల దురదృష్టమంటాడు. విత్తనాల కోసం హైదరాబాద్ వచ్చిన రైతులు మరుసటి రోజు దాకా ఆగాల్సి వచ్చింది. ఎటుపోవాలో తెలీక రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడుకున్నారు. పారిశ్రామిక వేత్త కుమారుడు మద్యం మత్తులో కారు పోనిచ్చి ప్రాణాలు తీస్తే పోలీసులు దాన్ని యాచకులపై ట్రక్కు వెళ్లినట్లు చిత్రీకరిస్తారు. హనుమంతుదాస్ దగ్గర విత్తనాల డబ్బు, నగలను లంచంగా తీసుకొని వదిలేసిన పోలీసు ఇన్స్పెక్టరును సస్పెండ్ చేయాలని జడ్జి ఆదేశిస్తారు.
చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల మదిని దోచుకుంటుంది. దర్శకుడు చరన్ లక్కాకుల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతంగా చిత్రీకరించారు. హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన జాలీ ఎల్ఎల్బీ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. కథానాయకుడు పాత్రలో సప్తగిరి ప్రేక్షకులను మెప్పించాడు. 2017 డిసెంబరు 7న చిత్రం రిలీజ్ అయింది. ప్రస్తుతం ఓటీటీలోప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.