మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులతో దెబ్బలు తిన్న పార్టీ కార్యకర్త గుప్తా ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసింది. ఈ ఘటనపై అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం ఆర్యవైశ్య నాయకులు కుప్పం ప్రసాద్‌తోపాటు పలువురు నాయకులు గుప్తాతో మాట్లాడారు. ఒంగోలు వన్టటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి నేరుగా గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ బాలినేని గుప్తా కుటుంబంతో మాట్లాడారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని మంత్రి బాలినేని విచారం వ్యక్తం చేశారు. గుప్తాను కొడుతున్నారనే సమాచారం తెలియడంతో వెంటనే తన అనుచరులను వారించినట్లు బాలినేని వెల్లడించారు.
వాస్తవానికి బాలినేని ఇలాంటి ఘటనలను సహించరు. ఆయన అనుచరులే స్వతంత్రంగా బాలినేని మెప్పు పొందడానికి ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అనుచరుల్లో మూఢ భక్తి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. చివరకు బాలినేనికి తన అనుచరుల వల్లే చెడ్డపేరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అర్థరాత్రి దాకా గుప్తా కుటుంబ సభ్యులు బాలినేని నివాసంలోనే ఉన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ బర్త్‌డే వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు. ఏదిఏమైనా మంత్రి బాలినేని అనుచరుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే అది బాలినేని రాజకీయ జీవితానికే మచ్చగా నిలుస్తుంది. అనుచరులను బాలినేని ఎడ్యుకేట్ చేసుకోకుంటే తిప్పలే మరి.