“ఏందీ ! పనికి పోకూడదా ! మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారా ! పనికెళ్లకుండా బువ్వెక్కడ నుంచి వత్తాది ! చాల్లే.. పెద్ద చెప్పొచ్చావ్ !” అంటూ సుబ్బమ్మ కొడవలి తీసుకొని బయల్దేరింది. వెంకటేశ్వర్లు మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎదురుగా వాళ్లబ్బాయి మూడు మాస్కులు తగిలించుకొని వస్తున్నాడు. “ సుబ్బమ్మా.. నీకు తెలుసా. ఒమైక్రాన్ శరవేగంగా దూసుకొస్తుందంటా. బయట తిరగొద్దు ! అంటూ ఏదో చెప్పబోయాడు. “ ఏం చదువుకుంటున్నావ్. ఇంత భయపడి సచ్చేవోడివి ఇంట్లో చావొచ్చు కదా ! పనీపాట లేని సన్నాసి వెధవా. ఇంకోసారి ఒమైక్రాన్.. ఆ క్రాన్.. ఈక్రానంటూ జనాన్ని భయపెట్టావో.. కోసి కారవెడతా ముదనష్టపోడా ! అంటూ చేతిలో కొడవలి చూపించింది.
అదెంత ప్రమాదమో తెలుసా అని ఆ కుర్రాడు చేతిలో మొబైల్ తీసి చూపించడానికి ప్రయత్నించాడు. నీకు తెలుసంట్రా ఏప్రాసోడా. ఇదిగో డాక్టర్ బ్రహ్మారెడ్డి ఏం చెప్పిండో సూడంటూ తన దగ్గరున్న సెల్ తెరిచి వినిపించింది. “ఒమైక్రాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు. కొంచెం జ్వరం, వళ్లు నొప్పులు, తలనొప్పి రావొచ్చు. రోజంతా శారీరక శ్రమ చేసే వాళ్లకు సోకే అవకాశమే లేదు. వ్యాయామం లేకుండా ఫాస్ట్ ఫుడ్ తింటూ నిరంతరం ఏసీ గదుల్లో ఉండే ఊబకాయులకు సోకడానికి అవకాశాలు ఎక్కువ. సోకినా నాలుగైదు రోజుల్లో విశ్రాంతి తీసుకొని మందులు వాడుకుంటే తగ్గిపోతుంది.” అంటూ డాక్టర్ బ్రహ్మారెడ్డి వాయిస్ వినిపిస్తోంది.
“ రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆడవాళ్లు పైట చెంగు ముక్కులకు అడ్డు పెట్టుకోవాలి. మగవాళ్లు హ్యాండ్ కర్చిఫ్ కట్టుకుంటే చాలు. మిగతా సమయాల్లో అక్కర్లేదు. సాధ్యమైనంత వరకు ఆరడుగుల దూరం పాటించండి. ఏదైనా తుమ్ము వస్తే చెయ్యి అడ్డు పెట్టుకుంటే తర్వాత చేతులు కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ఎన్ని వేరియంట్లు వచ్చినా ఏం కాదు. మన దేశంలో కరోనా పాజిటివ్ వల్ల మరణించింది కేవలం ఒక్క శాతంలోపు మాత్రమే.
అంటు వ్యాధులున్న దేశంలో కరోనా వైరస్ను తట్టుకునే రోగ నిరోధక శక్తి సహజంగానే జనంలో ఉంటుంది. అందువల్ల ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు. ఈపాటికే ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు అసలు సోకే అవకాశామే లేదు. అందువల్ల ఎలాంటి ప్రచారాలను నమ్మొద్దు. ఆర్థికంగా కుటుంబాలను గుల్ల చేసుకోవద్దు !” అంటూ డాక్టర్ బ్రహ్మారెడ్డి వాయిస్ వినిపిస్తూనే ఉంది. వెంకటేశ్వర్లు కొడుకు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తుంటే… సుబ్బమ్మ నవ్వుకుంటూ కదిలింది.