పాపం.. నెటిజన్ల లాజిక్కులకు బదులిచ్చేవాళ్లు లేక జుట్టు పీక్కుంటున్నారు.
అసలు సంగతేమిటంటే..
ప్రభుత్వ అధీనంలో ఉన్నవన్నీ రేట్లు తగ్గుతాయా..
పెరుగుతాయా అంటున్నారు.
అవన్నీ ప్రభుత్వ ప్రాధామ్యాలను బట్టి ఉంటుంది మరి.
మద్యం, ఇసుక ప్రభుత్వ విక్రయిస్తుంది.
వాటి ధరలను ప్రభుత్వమే పెంచింది.
పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌ను ప్రభుత్వమే అందిస్తోంది.
వీటిని కూడా ధరలు పెంచి అమ్ముతుంది.
సినిమా టిక్కెట్లనూ ప్రభుత్వమే అమ్మాలనుకుంటోంది.
ధరలు తగ్గిస్తుంది.
ఎందుకంటే సినిమా టిక్కెట్ల సొమ్ము లో
సింహభాగం యాక్టర్లు, నిర్మాతల జేబుల్లోకి పోతుంది.
ప్రభుత్వానికి వచ్చేది నామమాత్రమే.
అందుకని ధరలు తక్కువగా ఉండాలనుకుంటోంది.
సిమెంటు, ఐరన్, నిత్యావసరాలను
ప్రైవేటు కంపెనీలు అమ్ముతాయి.
ఇవీ ధరలు పెరుగుతాయి.
విద్య, వైద్యాన్ని ప్రైవేటు సంస్థలే అందిస్తాయి.
ఈ సేవల ధరలూ పెరుగుతుంటాయి.
కార్లు, బైకుల ధరలూ చుక్కలు చూస్తుంటాయి.
ఎందుకంటే.. వీళ్లంతా ప్రభుత్వాలకు అల్లుళ్లులాంటి వాళ్లు.
ఎన్నికలప్పుడు బోలెడు చందాలిస్తారు.
ఈ వ్యాపారులంతా ప్రభుత్వానికి బాగా కావాల్సిన వాళ్లు.
ఇప్పుడు అర్థమైంది కదా !
ఎవరి జేబులో నుంచి ఎంతెంత తీసుకోవాలనేది
ప్రభుత్వ విధి విధానాలను బట్టి ఉంటుంది.
ప్రజల కోసం.. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు..
వాళ్ల తాబేదారుల సంస్థలూ..
ఏ ప్రజల నుంచి ఎంతెంత లాక్కుంటున్నాయో అర్థమవుతుంది కదా !