తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌కు అంకురార్పణ చేశారు. ఈమేరకు 37 రాష్ట్రాలకు ఆయన లేఖలు రాశారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వివిధ రాష్ట్రాల పట్ల అనుసరిస్తోన్న వివక్షను దునుమాడడానికి ప్రతీ రాష్ట్రం భాగస్వామి కావాలని స్టాలిన్ ఆకాంక్షించారు.
స్టాలిన్ ఏర్పాటు చేసిన సమాఖ్యలో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్నవర్గాలు, ఇతర బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం సమాఖ్య కృషి చేస్తుందని స్టాలిన్ తెలిపారు. అందుకు అవసరమైన న్యాయ సలహాలను అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సమాఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు.
స్టాలిన్ ప్రారంభించిన సమాఖ్యకు అనేక రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించలేదు. మొట్టమొదటి నుంచి స్టాలిన్ వేస్తున్న ప్రతీ విప్లవాత్మక అడుగులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఏపీలోని అధికార ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగా మారింది.
ఇటీవల కుల వివక్ష నిర్మూలన దిశగా సాగుతున్న గ్రామ పంచాయతీలకు సీఎం స్టాలిన్ నజరానాలు ప్రకటించారు. ఆ విధంగా ఇక్కడ ఎందుకు అమలు చేయకూడదంటూ పోల్చుకోవడం అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు.