రాన్రాను మనిషి ప్రకృతి నుంచి వేరు పడుతున్నాడు. కృత్రిమ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరవుతున్నాడని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉంటానని చెప్పారు. ఇటీవల ఆయన ఎక్కువ సమయం ఫాంహౌస్‌లోనే గడుపుతున్నారు. ఈ సందర్భంగా తన మనోగతాన్ని మిత్రులతో పంచుకున్నారు.
‘ఏసీలు.. ఫ్యాన్ల కింద కరెంటు పోతే ఉండగలమా ! ఊపిరాడక అల్లాడతాం. అదే వేప చెట్టు కింద ఉంటే ఆ పరిస్థితి రాదు. అలాగే ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. దాంతో సంతృప్తి పడాలి. ఇంకా ఏదో కావాలనే తపన మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. దుఖ్ఖమయం చేస్తుంది. సగటు మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో !’అంటూ జగపతిబాబు మనోగతాన్ని ఆవిష్కరించారు.
నిజ జీవితంలో జగపతిబాబులా ఎందరుంటారు ! అంతేకాదు. జగపతిబాబు కుల వివక్షపై కూడా గతంలో స్పందించారు. ఈ జనరేషన్లో కులాలను పాటించడమేంటని సమాజాన్ని నిలదీశారు. మనిషి సహజంగా జీవించడానికి కులాలతో పనేముందన్నారు. తోటి మనిషి మనిషిగా చూడలేని వాళ్లు అవిటివాళ్ల కింద లెక్కేనని వ్యాఖ్యానించారు. తన కుటుంబం కులాభిమానానికి దూరంగా ఉంటుందని అప్పట్లో జగపతి బాబు చెప్పడం విశేషం.
వాస్తవం చెప్పారు జగపతిబాబు గారు…