కబ్జాకు కాదేదీ అనర్హం. అది చంద్రబాబుదైతేంటీ.. మరెవరి భూమి అయితేనేంటీ. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమినే కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తీరా గమనించి తహసిల్దారుకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో చంద్రబాబు నాయుడికి సర్వే నెంబరు 222/5లో 87 సెంట్ల భూమి ఉంది. 1989లో చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు ఈ భూమిని కొనుగోలు చేశారు. ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భూమిని ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి ఇచ్చారు. మిగతా 38 సెంట్ల భూమిని ఆన్లైన్ చేయాలని ఎప్పటి నుంచో తహసిల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఇదే అదనుగా భావించిన రాజేంద్ర నాయుడు భూమిని కబ్జా చేసేందుకు రాతి స్తంభాలు నిలేశారు. ఇది గమనించిన నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి తహసిల్దారుకు ఫిర్యాదు చేశారు. ప్రతీ ఏడాది సంక్రాంతికి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆ స్థలంలో రంగవల్లులు, క్రీడా పోటీలు నిర్వహించే వారని ఇందిరమ్మ తెలిపారు.