“వారంలో 5 కేజీలు తగ్గండి.
లేకుంటే డబ్బు వాపస్ !”
పేపర్లో ఈ ప్రకటన చూసి వాళ్లకు కాల్ చేశా.
ఓ అమ్మాయి ఫోన్ ఎత్తింది.
రేపు ఉదయం ఆరు గంటలకు
రెడీగా ఉండమని చెప్పింది.
తర్వాత రోజు ఉదయం 6 గంటలకు
నేను తలుపు తెరవగానే..
షార్ట్, షూ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి
“నన్ను పట్టుకోండి.. ముద్దు పెట్టుకోండి”
అని పరిగెత్తడం మొదలుపెట్టింది.
నేను బాగా కష్టపడి పరిగెత్తా. పట్టుకోలేకపోయా.
మొత్తానికి వారంలో 5కేజీలు మాత్రం తగ్గిపోయా.
ఈ సారి10 కేజీల ప్రోగ్రామ్ తీసుకున్నా.
తర్వాత రోజు ఉదయం 6 గంటలకు తలుపు తెరవగానే..
షార్ట్, షూ వేసుకున్న ఇంతకు ముందుకన్నా అందమైన అమ్మాయి
“నన్ను పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి”
అని పరిగెత్తడం మొదలుపెట్టింది.
నేను బాగా కష్టపడి పరిగెత్తా. అయినా పట్టుకోలేకపోయా.
మొత్తానికి వారంలో 10 కేజీలు మాత్రం తగ్గిపోయా.
ఇదేదో బావుందనిపించింది.
ఈ సారి అత్యాశకి పోయి 25 కేజీల ప్రోగ్రామ్ అడిగా.
కస్టమర్ కేర్ వాడు ” నిజంగా 25 కేజీల ప్రోగ్రాం కావాలా మీకు?”అని అడిగాడు.
“కావాలి ! పంపించండి” అన్నా.
తర్వాత రోజు ఉదయం 6 గంటలకు తలుపు తెరవగానే..
ఒక గొరిల్లా మాదిరిగా ఉన్న అమ్మాయి కంటపడింది.
” నాకు దొరికావో, బండ పెదవులతో నిన్ను ముద్దు పెట్టుకుంటా” అంది.
పరుగు అందుకున్నా… ఎంత తగ్గానో నాకే తెలీదు.
ఇంకా దొరకలేదు.. పరిగెడుతూనే ఉన్నా !
- ఎవ్వరినీ కించ పరిచే ఉద్దేశం లేదు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే ఈ హాస్య రచన
– కృపానందం కె