ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ 24 గంటలూ కంటెస్టెంట్స్ కనిపించే షో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. షో 24 గంటలూ లైవ్ కావడమన్నది ఒక వినూత్న ప్రక్రియ. ఈసారి షోలో పాల్గొన్న వారిని చూస్తే.. బిగ్ బాస్ నిర్వాహకుల ఉద్దేశమేంటో ఈజీగానే అర్థమవుతుంది. మొత్తం బోల్డ్ భామలతో హౌస్ ను నింపేశారు బిగ్ బాస్ టీమ్. మచ్చుకు పరిశీలిస్తే..
ముమైత్ ఖాన్. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్. బోల్డ్ నెస్ కు ఏమాత్రం భయపడే రకం కాదు. తొలి సీజన్ కంటెస్టెంట్ కూడా. ఇక 7ఆర్ట్స్ సరయూ. చివరిగా టెలికాస్ట్ అయిన సీజన్ కంటెస్టెంట్. మొదటి వారంలోనే బయటికొచ్చేసింది. ఆమె యూట్యూబ్ లో బూతుల ద్వారా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
మరో కంటెస్టెంట్ శ్రీరాపాక పేరును గూగుల్ లో కొడితే.. ఆమె ఫొటోలు చూసి కంగారుపడతాం. ఆ రేంజ్ బోల్డ్ కంటెంట్ కు పెట్టింది పేరు ఆమె. దర్శకుడు వర్మ ఆమెతో నగ్నం అనే కళాఖండాన్ని కూడా తీశాడు.
ఇక అదే వర్మకు చెందిన ఐస్ క్రీమ్ అనే సినిమాలో నటించిన మరో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి మదివాడ. ఈ అమ్మడు కూడా బోల్డ్ నెస్ లో ఏమాత్రం తగ్గదు. అరియానా గురించి చెప్పేదేముంది. ఈమె కూడా వర్మ స్కూలే. అయితే సినిమా ల్లో కాదు.
ఒక ఇంటర్వ్యూలో వర్మ ఈమెపై చేసిన వల్గర్ కామెంట్స్ వలన బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వచ్చింది. తాజాగా మరోమారు బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె బోల్డ్ నెస్ గురించి చెప్పుకోనక్కర్లేదు.
ఇదే తరహాలో ఆషు రెడ్డి కూడా వర్మతో వ్యాఖ్యలు చేయించుకునేందుకు ఒక ఇంటర్వ్యూను చేసింది. పొట్టి దుస్తుల విషయంలో ఏమాత్రం రాజీపడని మరో పాత్ర ఆమె. ఇక ఇంకో అమ్మాయి చొక్కారపు స్రవంతి. ఈమె కూడా డ్రస్సింగ్ లో చాలా డేరింగ్ అని గూగులమ్మ చెబుతోంది. వీరిని బట్టే ఈ నాన్ స్టాప్ 24గంటల లైవ్ ప్రోగ్రామ్ విషయంలో బిగ్ బాసోళ్లు ఏం ప్లాన్ చేశారో అర్థమవుతూనే ఉంది కదా.
బిగ్ బాస్ ముంబై టీమ్ లో వర్మకు సన్నిహితులున్నారు. అతని సూచనల మేరకు అతడికి సన్నిహితులైన భామలను ఈ ఓటీటీ షో కు ఎక్కువగా ఎంపిక చేశారన్న వార్తలున్నాయి. అందులో నిజమెంతో తెలీదు. షోను హిట్ చేసేందుకు బీబీ టీం మాత్రం బోల్డ్ నెస్ షార్ట్ కట్ ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం లైవ్ టెలికాస్ట్ కావడంతో ఎక్కడా ఎడిటింగ్ కు, బీప్ లకు స్కోప్ ఉండదు.
అందువలన హౌస్ లో ఏం జరిగినా.. ఏం మాట్లాడుకున్నా.. ప్రేక్షకులకు అంతా ‘రా’ గానే.. అంటే పచ్చిగానే ఫీడ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే కంటెంట్ ఉంటే.. ఇలాంటి షార్ట్ కట్స్ అవసరం ఉండదు కదా అన్న విమర్శలు బిగ్ బాస్ పై వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణ ఏకిపారేయడం చూశాం. మున్ముందు ఈ షో ఏ రేంజ్ వివాదాలు సృష్టిస్తుందో.. చూడాలిమరి.