మీతరం ప్రజలు అతి సామాన్యులు.
రాత్రి పెందరాళే పడుకుంటారు.
ఉదయాన్నే నిద్ర లేస్తారు.
నడక అలవాటున్నోళ్లు.
శరీరం నుంచి స్వేదాన్ని చిందించేవాళ్లు.
కష్టాన్ని నమ్ముకున్నోళ్లు.
మరో పది పదిహేనేళ్లలో మీ తరం ప్రపంచం నుంచి కనుమరుగవబోతోంది.
ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమే.
ఉదయాన్నే వాకిట కళ్లాపి చల్లేవాళ్లు.
పెరట్లో మొక్కలకు నీళ్లు పెట్టి కంటికి రెప్పలా చూసుకునేవాళ్లు.
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్లు.
పూజ కాకుండా ఏమీ తినని వాళ్లు.
మనిషిని మనిషిగా చూసేవాళ్లు.
అందరికీ ఆప్యాయతలు పంచేవాళ్లు.
స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్లు.
ఎదుటివారికి తోచిన సాయం చేసే గుణమున్నోళ్లు.
ఆస్తిపాస్తులెన్ని ఉన్నా నిరాడంబరంగా మెలిగేవాళ్లు
వంట గదినే ఆరోగ్య కేంద్రంగా భావించేవాళ్లు.
పండగలు.. పబ్బాలకు పదిమందికీ సంతోషాన్ని పంచేవాళ్లు.
పుట్టిన రోజున దీపం వెలిగించి పండగ చేసుకునేవాళ్లు.
సంప్రదాయ దుస్తులు ధరించేవాళ్లు.
కులమతాలకు అతీతంగా వరసలతో పిల్చుకునేవాళ్లు.
కలిమి లేముల్లో చిర్నవ్వు చిందించేటోళ్లు.
ఆపదలో చేయి అందించే మానవత్వమున్నోళ్లు.
బిడ్డలకు పాలిచ్చి మమతలను పంచినోళ్లు.
ఎదుటివారి కష్టాలకు కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు.
భవబంధాలకు అతీతంగా ఆలోచించేవాళ్లు.
తప్పు తనవాళ్లు చేసినా దండించే గొప్పోళ్లు.
ప్రజల ఐక్యతకు ప్రాణమిచ్చినోళ్లు.
పది మంది సంతోషంగా ఉండి అందులో తాముండాలనుకునేవాళ్లు.
అసమానతల్లేని నవ సమాజం కోసం పరితపించినోళ్లు.
ఇలాంటి తరాన్ని ఎంతో గౌరవించాలి.
కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ప్రేమానురాగాలను పంచే తరాన్ని గుండెల్లో పెట్టుకోవాలి.
రేపటి తరానికి వీళ్ల జీవనమే స్ఫూర్తి కావాలి.
భావితరానికి ఇలాంటి తరం వాళ్ల జీవితాలను కథలుగా అందించాలి.
అవనిపై ఆ తరం మనిషి కథ పరిఢవిల్లాలి.
మానవ మనుగడను సుసంపన్నం చేస్తూ వర్ధిల్లాలి.
courtesy : Ravi Prakash FB post