వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ పోస్టు నుంచి ఆర్డీవో దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో 1.33 లక్షల పోస్టులను భర్తీ చేశారు. దాదాపు 23,000 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం తీరు కారణంగా ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన జరగక పోయినందున జాప్యం చోటుచేసుకున్నట్లు కేసీఆర్ వివరించారు.