అది 1940 మార్చి 13.
లండన్ లోని కాక్స్ టన్ హాల్లో ఓ కాన్ఫరెన్స్ జరుగుతోంది.
అక్కడ ప్రసంగించడానికి ఓ ప్రముఖవ్యక్తి వస్తున్నాడు.
ఆయన వారి దృష్టిలో ఓ హీరో.
ప్రేక్షకులంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.
ఆయన రానే వచ్చాడు.
సభికులందరూ ఉత్సాహంగా చప్పట్లుకొట్టి ఆహ్వానించారు.
సభాధ్యక్షుడు ఆయన్ని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానించారు..
ఆయన ఇండియాలో చేసిన అద్భుతాల గురించి మాట్లాడారు.
సభికులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాడు.
ఇంతలో తలపాగతో గడ్డం పెంచుకొని, చేతిలో ఓ పుస్తకం పట్టుకున్న ఓ యువకుడు గంభీరంగా ఆయన వైపు వస్తున్నాడు.
ఎటువంటి తడబాటులేకుండా వస్తున్న ఆ యువకుడిని చూస్తున్నాడా సెలబ్రిటీ.
దగ్గరకు వచ్చిన ఆ యువకుడు పుస్తకం మాటున దాచిన పిస్టల్ తీసి ఆ సెలబ్రిటీని షూట్ చేశాడు.
ఆరు బుల్లెట్స్ దిగిన ఆ సెలబ్రిటీ నేలకొరిగాడు.
క్షణకాలంలో జరిగిన పరిణామానికి సెక్యూరిటీ తేరుకొనే సరికే…
ఆ యువకుడు బిగ్గరగా నవ్వుతూ…
నవ్వుతూ సృహ కోల్పోయాడు.
ఆ యువకుడిని కోర్టులో నిలబెట్టారు.
ఈ హత్య ఎందుకు చేశావు?
నీ పేరేమిటి అని జడ్జి అడిగారు.
అందుకు ఆ యువకుడు స్పందిస్తూ..
‘నా పేరు రామ్ మహ్మద్ సింగ్ అజాద్.
నేను చంపిన వ్యక్తికి ఈ భూమిపై బతికేందుకు అనర్హుడు.
21 ఏళ్ల క్రితం పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో నిరాయుధులైన నా సోదర సోదరీమణులు1200 మందిని అతి దారుణంగా కాల్చి చంపిన క్రూరుడు ఈ ఓ డయ్యర్. అందుకే అప్పటి నుంచి నేను ఇతన్ని వెంటాడుతూ వస్తున్నాను.
ఇన్నిరోజులూ ఇతనిపై పగే నన్ను బతికించింది.
నా కక్ష తీరింది.
నాకు ఉరిశిక్ష వేసినా.. కాల్చిచంపినా భయంలేదు.
నాకు బతకాలని లేదు. జైహింద్ !’ అంటూ ముగించాడు ఆ యువకుడు.
అతని మాటలు విని జడ్జి నిర్ఘాంతపోయాడు.
ఏం చెప్పాలో తెలియలేదు.
ఎలిజిబెత్ రాణికి ఆయన గురించి తెలియజేస్తాను.
అప్పటి వరకు కస్టడీలో ఉండాలని జడ్జి ఆదేశించారు.
తర్వాత ఉద్ధం సింగ్ కు ఉరిశిక్ష విధించారు.
సిక్కులను చంపినందుకు ఉద్ధం సింగ్ డయ్యర్ ను చంపాడు.
మా కోసం కాదు అనే మాట దయచేసి అనకండి ప్లీజ్ !
సేకరణ : K Sreedevi Kosinepalli FB Wall నుంచి