పార్టీ మారే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగలనుంది. కోమటిరెడ్డి పార్టీ మారుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పారు కోమటిరెడ్డి. గౌరవం ఇవ్వని చోట ఉండలేనన్నారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనని చెప్పారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్పై పోరాడతానన్నారు కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. .దీంతో ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోవచ్చంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మీడియాకు దూరంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చౌటుప్పల్, నాంపల్లిలో కార్యకర్తలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తానన్నారు. సొంత పార్టీలోనే ఆదరణ కరువైందని వాపోయారు.
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అనుభవం, ధైర్యం, పేరున్న వారిని ముందు పెడితేనే కాంగ్రెస్ లో జోష్ వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అడ్రస్ లేని, డిపాజిట్ రాని వారిని ముందు పెట్టి కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతారని ప్రశ్నించారు. గౌరవం ఇవ్వని చోట ఉండలేనన్నారు.
ఇక తాను ఎవరి కింద పనిచేయలేనని రాజగోపాలరెడ్డి చెప్పారు. అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని తెలిపారు. పార్టీ మారడం పై కార్యకర్తలను ఒప్పించి అందరి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటాన్నారు. తనను నమ్మిన వారికి అన్యాయం జరగదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసానిచ్చారు.