సాధారణంగా గుహలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి అజంతా, ఎల్లోరా, బొర్రా గుహలు. అయితే గుహల్లో అత్యంత పొడవైన గుహలూ మన దేశంలోనే ఉన్నాయి. అలాంటి పొడవైన వాటిల్లో ఒకటి మేఘాలయ లోని సున్నపు రాయి గుహ.
తూర్పు ఖాశి హిల్స్ జిల్లాలోని లైత్సో హమ్ గ్రామంలో ఉన్న ఈ గుహ పేరు క్రెమ్ పురి. దీని పొడవు 24.5 కిలోమీటర్లు. 2016లో ఈ గుహను కనుగొన్నారు. ఇందులో డైనోసార్ల సంతతికి చెందిన మొసాసారస్ ల శిలాజాలు కూడా ఉన్నాయి. ఇవి 70 మిలియన్ సంవత్సరాల కిందటివని ఆర్కియాలజిస్టులు తేల్చారు.
ఈ సున్నపురాయి గుహ భారత దేశంలోనే రెండో అతి పొడవైన గుహగా నిలించింది. మొదటి స్థానం మేఘాలయకే చెందిన పూరతనమైన సున్నపురాయి గుహ క్రెమ్ లియత్ ప్రా ఉమిమ్ లాబిత్ దక్కించుకుంది. దీని పొడవు 31 కిలోమీటర్లు.
ఈ గుహల పొడవులను కొలిచే బాధ్యతను మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్(ఎంఎంఏ) సభ్యులు తీసుకున్నారు. ఈ సంస్థకు చెందిన సభ్యులు మేఘాలయ లో ఇప్పటివరకు 1000 గుహలను కొలిచారు. అధికారిక సమాచారం ప్రకారం మేఘాలయ లో ఇప్పటివరకు గుర్తించిన గుహలు 1,650 పైనే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వీలైతే ఓ లుక్కేయండి.