‘లాయ్ హారోబా ‘ మణిపూర్ ప్రజల నృత్య డ్రామా పండగ . దేవతలు సరదాగా ఆడి పాడి వినోదంలో మునగడమని అర్థం. ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల్లో దాదాపు 15 రోజుల పాటు అక్కడి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఇది.
స్థానిక స్థల పురాణం మైరాంగ్ పర్బా ప్రకారం.. దైవాంశతో జన్మించిన ఖంబ అనే సాహస పేద యువకుడు, తైబీ అనే అందమైన రాకుమార్తె చుట్టూ అల్లిన నృత్య డ్రామా కథలు ఈ ఉత్సవంలో ముఖ్య ఘట్టాలు. అక్కడి ప్రజలు వారిని శివపార్వతులుగా భావిస్తారు.
లాయ్ హారోబా ఉత్సవం మైరాంగ్ అనే గ్రామంలోని తాంగ్ జింగ్ ఆలయం ముందు జరుగుతుంది. ఈ ఉత్సవంలో ఒక వ్యక్తి లేక బృందంతో నృత్య డ్రామా ప్రదర్శన జరుగుతుంది. దీన్ని స్థానిక ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో తిలకిస్తారు. పండగను ఉత్సాహంగా జరుపుకుంటారు.