రంగు , రుచినిచ్చే సుగంధ ద్రవ్యంగా కుంకుమ పువ్వు మనందరికీ తెలుసు. అయితే కుంకుమ పువ్వులో ఔషధ విలువలు కూడా ఉన్నాయని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
కుంకుమ పువ్వు లో మెదడు కణాలను రక్షించే అరుదైన గుణాలు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ శాస్త్రజ్ఞుల పరిశోధన లో తేలింది. దీని వాడకం వలన న్యూరో డిజనరేటివ్ వ్యాధులు అంత త్వరగా రావు.
ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్ , డిమెన్షియా వ్యాధులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో వాటికి విరుగుడుగా కుంకుమ పువ్వు రుజువయింది. అల్జీమర్స్ కు వాడే ‘డొనె పెజిల్’ మందుకు సమానంగా కుంకుమ పువ్వు పనిచేస్తుంది.
సైకో ఫార్మకాలజీ అనే జర్నల్ లో ప్రచురించిన దాన్నిబట్టి ‘ డొనె పెజిల్’ 10 ఎమ్ జి టాబ్లెట్ కు బదులుగా కుంకుమ పువ్వు తో తయారు చేసిన 30 ఎమ్ జి టాబ్లెట్ ను అల్జీమర్స్ తొలిదశలో ఉన్న వారికి వినియోగించారు. వారి మీద బాగా ప్రభావం చూపినట్లు ఈ జర్నల్ పేర్కొంది. కుంకుమ పువ్వా మజాకా !