పాడి పశువుల్లో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం కేవలం మేక ద్వారానే ఉంది. వీటిని సులభంగా కూడా పెంచుకోవచ్చు. పైగా పేద వాడి పాడిగా మేకను ఎప్పుడో వర్ణించారు.
ఇతర పాడి జంతువులతో పోలిస్తే మేకలకు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ. అలాగే సంతానోత్పత్తి కూడా ఎక్కువ. పాలు సైతం ఎక్కువ కాలం ఇస్తుంది.
మేక పాలకు ప్రస్తుతం మార్కెట్ లో బాగా గిరాకీ ఉంది. వీటి పాల ద్వారా పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. మేక పాలతో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులతోపాటు పలు వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. వీటి పాలకు రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువేనట ! మేకలను తిప్పి మేపడమే కొంచెం కష్టం. గ్రామీణ ప్రజల ఆదాయం పెంపునకు మేకల పెంపకం ఎంతో దోహదపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలి.