శుభ కార్యాని కెళ్లినా రాజకీయాలు ఆపాదించడం సరికాదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 2న ఢిల్లీలో డీఎంకే కొత్త కార్యాలయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఆయన ఆహ్వానం మేరకు తామంతా కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.
కొత్త ఇంట్లోకి ప్రవేశించడం లాంటి శుభకార్యం. మన సంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి వారితో ఆనందాన్ని పంచుకోవడం ఆనవాయితీ. అదే తరహాలో డీఎంకే అధినేత తాము నూతనంగా నిర్మించిన కార్యాలయంలోకి ప్రవేశించే కార్యక్రమానికి టీడీపీతో సహా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. మన భారతీయ సంస్కృతికి అనుగుణంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్న విధంగా ఈ పర్యటన రాజకీయపరమైనది కాదు. సంప్రదాయ శుభకార్యంపై కూడా స్వార్థ రాజకీయాలు చేయడం విచారకరం. ఇటువంటి తప్పుడు వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శుభకార్యానికి రాజకీయాలు అంటగట్టడం దారుణమని వాపోయారు.
ఎవరి ఇంట శుభకార్యానికి పిలిచినా వెళ్లడం సహజం. రాజకీయ వైరుధ్యాలున్నా వ్యక్తిగత స్థాయిలో ఒకరి ఇంట శుభకార్యాలయాలకు ఒకరు వెళ్లడం, వేర్వేరు పార్టీల్లో ఉన్నా స్నేహాన్ని కొనసాగించడమన్నది సంబంధిత నేతల రాజకీయ పరిణతికి, పరిపక్వతకు అద్దం పడుతుంది.
గతంలో ఎందరో కీలక నేతలు ఒకరి ఇంట శుభకార్యాలయాలకు మరొకరు వెళ్లిన సందర్భాలున్నాయి. తెలుగుదేశం పార్టీ గానీ, పార్టీ ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ నిబద్ధతతో స్వచ్చమైన రాజకీయాలు చేస్తామే తప్ప చాటుమాటు రాజకీయాలు చేయం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగా కాక శత్రువులుగా విచారకరమని పేర్కొన్నారు.
అవునా టీడిపి నాయకులు బాధపడుతున్నారా! ప్రతి పనిని రాజయకీయం చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబుగారు దిట్ట అని అందరూ అంటుండగా విన్నాను. ఇప్పుడు ఈ వార్త విని అయోమయంలో పడ్డానే???