ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడికి విఫలయత్నం చేశారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే నివాసం మీద దాడి చేసేందుకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్ బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా ద్విచక్ర వాహనాల పై తరలివచ్చారు.
ఇటీవల ఒంగోలులో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి వ్యవహారాన్ని సాక్ష్యాలతో ఎమ్మెల్యే స్వామి బయటపెట్టారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడబోతున్నట్లు టీడీపీ శ్రేణులు గ్రహించాయి.
టీడీపీ కార్యకర్తలు సైతం తూర్పు నాయుడు పాలెం గ్రామానికి భారీగా తరలివచ్చారు. రెండు పార్టీలు భారీగా మోహరించాయి. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడవ తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బాలినేని కనుసన్నల్లోనే దాడికి యత్నించినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.