డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పినిపె విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ద పాలన తీసుకొచ్చేందుకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు.
జనసేనాని పవన్ కల్యాణ్ డాక్టరు బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలను జనసేన పార్టీ సహించబోదని పవన్ కల్యాణ్ వెల్లడించారు.