ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు తమ పేర్లను www.nritdp.comలో నమోదు చేసుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో వెబ్ సైట్ను ప్రారంభించారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఓ వెబ్సైట్ను రూపొందించారు. దీని ద్వారా పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు.
వివిధ దేశాల్లో మొత్తం 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాటు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ – ల్యాండ్ లైన్ +918645350888 వాట్సాప్ +918950674837 నంబర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, ఏపీలో ఐటి, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఈ విభాగం చేపడుతుంది.
విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోసిజరల్ గైడ్ లైన్స్ ఇవ్వడంతోపాటు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ ఎన్ఆర్ఐ టిడిపి సెల్ పని చేస్తుంది. ఈ సందర్బంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ యుద్ద సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో అందించిన సేవలను కొనియాడారు.
అనేక దేశాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విదేశాల్లో స్థిరపడ్డ టీడీపీ అభిమానులంతా ఈ వైబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కార్యక్రమంలో డాక్టరు వేమూరి రవి, రాజశేఖర్ చప్పిడి తో పాటుగా పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.