నాడు..
“ ఇంతకన్నా దారుణం ఏముంటుంది సార్ ! లోకల్ ఎమ్మెల్యేకి సమాచారమివ్వకుండా సమీక్ష ఎలా చేస్తారు ! ప్రొటొకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులకు లేదా ! దీనిపై శాసనసభలో కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ! ”అంటూ నాటి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.
ఏడేళ్ల క్రితం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులపై అక్కడే సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వలేదు.
నేడు..
రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి జిల్లాకు వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కనీసం స్వాగతం పలికిన వాళ్లు లేరు. ఇక సొంత పార్టీలో వాళ్లే పట్టించుకోకుంటే అధికారులు ఎందుకు స్పందిస్తారు ! రెండోసారి మంత్రి పదవి రాకున్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అశేష వాహన శ్రేణితో పెద్ద ఎత్తున జిల్లా సరిహద్దుల్లో స్వాగతం పలికారు.
నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అవమానించింది. ఇప్పుడు మంత్రి అయినా కూడా సొంత పార్టీలో ఇసుమంత గౌరవం లేదు. హవ్వ.. అభినవ పూలే మంత్రి వర్గంలో ఓ ఎస్సీ మంత్రికి దక్కుతున్న మర్యాద ఏమిటో కళ్లారా చూస్తున్నాం. రియల్లీ పిటీ యూ సార్ !