ఏదైనా ఆవిష్కరణకు ఊతమివ్వాలంటే అది తెలంగాణకే సాధ్యం. అక్కడ కుటుంబ సభ్యులతోపాటు ఇరుగు పొరుగు సాయమందిస్తారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ అయితే నేనున్నా కానివ్వండి అంటారు. అందుకే ఇక్కడ ఓ బడుగు కుటుంబం నుంచి వచ్చిన మండాజి నర్సింహాచారి ఓ గ్రామీణ శాస్త్రవేత్తయ్యాడు. వైరస్ కిల్లర్ ను రూపొందించి ఇప్పుడు అందరితో శబ్బాష్ నర్సింహాచారి అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
నిజామాబాదు జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజినర్సింహాచారి రూపొందించిన ఇన్‌స్టా షీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటీ రామారావు హైద్రాబాద్ లో ఆవిష్కరించారు, ఈ సందర్బంగా ఆయన పరికరం ఎలా రూపొందించింది అడిగి తెలుసుకున్నారు. చారిని అభినందించారు.
పరికరాల తయారీ కోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని తెలిపారు. గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇప్పుడు ఈ స్థాయికి చేరడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
ప్రజారోగ్యం వైరస్ ల బారిన పడకుండా నివారించేందుకు రెండేండ్లు శ్రమించి ఇన్‌స్టా షీల్డ్‌ను తయారు చేసినట్లు చారి వెల్లడించారు. కరోనా, సార్స్, ఓమైక్రాన్, డెల్టా లాంటి వైరస్ లను నెగిటివ్ ఎలెక్ట్రాన్ల సహాయంతో సంహరించే పరికరాన్ని రూపొందించారు. సీసీఎంబీ, సీడీఎస్‌సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీన్ని ప్రామాణికతను ధృవీకంరించాయి.
చారి హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీప బుద్వేల్ లో ఉంటున్నారు. కరొన మూలాల్ని తెలుసుకొని, పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం రూపొందించారు. ఆత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్ లను సంహరిస్తుంది. దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, ధియేటర్స్,లో వినియోగించవచ్చు
ఇంకా పంక్షన్ హాల్స్, ఆఫీసులు, ఇండోర్ స్టేడియాలు, హోటల్స్‌లో ఈ పరికరాన్ని తేలిగ్గా అమర్చుకోవచ్చు. దీనికి కావాల్సింది కేవలం 3.6 వాట్ల విద్యుత్ మాత్రమే. మొబైల్ చార్జర్కే 5 వాట్ల కరెంటు కావాలి. అంతకన్నా తక్కువ విద్యుత్ వినియోగంతో ఈ పరికరం పనిచేయడం అద్భుతం. నర్సింహాచారి భవిష్యత్తులో ప్రజావసరాలు తీర్చే గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని ఆశిద్దాం.