దేనికైనా కొన్ని పరిమితులుంటాయి. సమయ సందర్భాలుంటాయి. అవేమీ పట్టించుకోకుండా అన్నింటినీ ప్రచారానికి వాడుకోవడం సభ్యతా సంస్కారం అనిపించుకోదు. అత్యాచారానికి గురైన మహిళ భర్తకు పరిహారం చెక్కు ఇస్తూ ఓ మంత్రి, మేయర్, జిల్లా కలెక్టరు కలిసి ఫొటోలు దిగడం దారుణం. రేపు అతను ఎక్కడైనా తలెత్తుకొని తిరగగలడా ? ఇప్పటిదాకా వాళ్ల సొంతూరికే తెలిసింది. ఇప్పుడు రాష్ట్రమంతా తెలిసేట్లు చేశారు. పేదలంటే అంత అలుసా ! వాళ్లకంటూ ఆత్మ గౌరవం ఉండదా !
ప్రకాశం జిల్లాకు చెందిన పేద భార్యాభర్తలు పొట్ట చేతబట్టుకొని పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంకకు బయల్దేరారు. రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకునే సరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ప్లాట్‌ఫాంపైనే పడుకొని తెల్లారి వెళ్దామనుకున్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీదపడి తిరిగే బేవార్స్లు చూశారు. భర్తపై దాడి చేశారు. బయట నుంచి వచ్చినోళ్లు కదా ఏం చేసినా నోరు మెదపరని భావించినట్లున్నారు. భార్యను చెరబట్టారు.
భర్త ధైర్యంగా ఇరుగు పొరుగు సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం జగన్ స్పందించారు. పోలీసు యంత్రాంగం వేగంగా కదిలింది. నిందితులను పట్టుకున్నారు. బాధితురాలిని ఒంగోలు రిమ్స్‌లో వైద్య పరీక్షలకు పంపారు. ఈలోగా ప్రతిపక్ష టీడీపీతోపాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాల వాళ్లు పరామర్శించడానికి వెళ్తే ఆస్పత్రి దగ్గర తోసేశారు.
ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించడం హర్షణీయం. విపక్షాలను, ప్రజా సంఘాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించి సీఎంతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు పరిహారం ఇప్పించడాన్ని స్వాగతించాల్సిందే. కానీ ఆ కుటుంబం పరువు ప్రతిష్టల గురించి పట్టించుకోకపోవడం విచారకరం.
ఆమె భర్తకు పరిహారం చెక్కును అందజేస్తూ మీడియాకు ఫొటోలు ఇవ్వడం సరికాదు. ఆమె అత్యాచారానికి గురైందన్న సంగతి మీడియాలో రాకముందు ఆమె భర్తకు తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ భర్తనే రోడ్డున పడేశారు. రేపు వాళ్లు ఎక్కడ తలదాచుకున్నా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో.
Plz Support us

Encourage Independent Journalism
వాళ్ళేదో ఉపాధికోసం ఇస్తున్న చెక్ లాగా ఫీల్ అవుతున్నారు. మినిస్టర్ అంటే వాళ్ళకి పబ్లిసిటీ అంటే ఇష్టం , దానికి కాదేదీ అనర్హం అనుకుందాం, కానీ కలెక్టర్ గారికన్నా తెలియాలిగా ఏది పబ్లిక్ చేయాలో ఏది చేయకూడదో.