ఆ పాప ఆంగ్లంలో మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయారు సీఎం జగన్. చాలా చక్కని ఉచ్చారణతో స్పష్టంగా మాట్లాడుతుంటే తన్మయత్వం చెందారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జడ్పీ హైస్కూలు విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఆ పిల్లల ప్రతిభ గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ విద్యార్థులను సీఎం జగన్ తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు.

మొత్తం ఐదుగురు విద్యార్థులు వచ్చారు. వాళ్లకు ఆంగ్లం బోధించిన ఉపాధ్యాయుడు ప్రసాద్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. తేజశ్విని అనే విద్యార్థిని తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.929 సీఎం సహాయ నిధికి ఇచ్చింది. తేజశ్వినిని సీఎం మెచ్చుకున్నారు. కేవలం 19 రూపాయలు తీసుకొని మిగతా నగదు తిరిగి ఇచ్చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని పట్టుదలతో ఉంది. అన్ని తరగతుల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని బోధించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బెండపూడి జడ్పీ హైస్కూలు విద్యార్థుల ప్రతిభను ప్రజలంతా గమనిస్తారని విద్యార్థులతో సీఎం మాట్లాడారు. వాళ్ల ప్రతిభను మెచ్చుకున్నారు.
Share and Contribute Rs.100
Encourage Independent journalism
