కేటీఆర్ అంతటి విజన్ ఉన్న యువ పొలిటికల్ లీడరును తానెప్పుడు చూడలేదని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, ఎంటర్పెన్యూర్ ఆశా జడేజా మోత్వాని కొనియాడారు. 20 ఏళ్ల తర్వాత భారతదేశానికి కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. దావోస్ లో కేటీఆర్ ను కలిసిన ఫోటోలను ఆశా జడేజా ట్విటర్లో షేర్ చేశారు. ఆశ జడేజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఆశా జడేజా మోత్వాని మంత్రి కేటీఆర్ ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కేటీఆర్ అద్భుతంగా కృషి చేస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ పని తీరు సూపర్ అంటూ కొనియాడారు. దావోస్ లో తెలంగాణ టీమ్ ఫుల్ ఫైర్ తో ఉందన్నారు. ఫ్యూచర్ లో తెలంగాణ డీల్స్ బిలియన్ డాలర్లు దాటి వెళ్లే అవకాశం ఉందని తన ట్వీట్ లో ఆశా జడేజా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సదస్సులో తనదైన మార్క్ చూపిస్తూ కేటీఆర్ దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
మొదటి రెండు రోజుల్లోనే పలు దిగ్జజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించేలా కేటీఆర్ చర్చించారు. పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటనలు కూడా చేశాయి. దావోస్ లో కేటీఆర్ టీమ్ వర్క్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
