ఆంధ్రా ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం సీమలో ఓ గ్రామం కృష్ణమ్మ ఒడిలో కలిసిపోయింది. అదే సిద్దేశ్వరం. శ్రీశైలం జలాశయం ముంపు గ్రామం. రాయలసీమకు వాటా ప్రకారం కృష్ణా జలాలు తరాల నుంచి అందడం లేదు. ప్రతీ ప్రభుత్వంలోనూ తాగు, సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకతపై నోరు మెదపడం లేదు. సీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు సిద్దేశ్వరం ఓ ఉద్యమానికి ఊపిరి పోసింది. రాయలసీమకు న్యాయం చేయాలని కోరుతూ మొట్టమదట మే 31, 2016న సిద్దేశ్వరంలో జలదీక్ష చేపట్టారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా మే 31న ఇక్కడ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది.
నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిషేధాజ్ఞలను ధిక్కరించారు. కృష్ణానదిని మళ్లించడానికి వేలాది మంది ప్రజలు సిద్దేశ్వరంలో అలుగు నిర్మించడానికి లాంఛన ప్రాయంగా ప్రజా శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా సిద్దేశ్వరంలో జలదీక్ష చేస్తుంటారు. ప్రభుత్వాల దమన నీతిని ఎలుగెత్తి చాటుతుంటారు. నీళ్ల కోసం ఉద్యమం ఓ సంప్రదాయంగా మారింది. ఆ నిరసన కార్యక్రమానికి సీమ ప్రజలు, మేథావులు, విద్యార్థులు, యువత సిద్దేశ్వరం బాట పట్టారు.

దీనిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లో స్పందన లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ప్రకటించలేదు. 2016లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్దేశ్వరం యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమంపై మౌనం పాటిస్తోంది. కృష్ణా జలాల విషయంలో రాయలసీమ, కోస్తా మధ్య వివాదం రేగితే రాజకీయంగా తమకు నష్టమని వైసీపీ నష్టమని భావించి ఉండొచ్చు.
ఎలాంటి ముంపు ఇబ్బందుల్లేకుండా అత్యల్ప ఖర్చుతో 50 టీఎంసీల వరద నీటిని సిద్దేశ్వరం వద్ద నిల్వచేయొచ్చు. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయుడు, జగన్ దీన్ని గుర్తించకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.350 కోట్లు వెచ్చిస్తే వంతెనను బ్యారేజీగా మార్చొచ్చు
‘‘ఆంధ్రాలోని సిద్దేశ్వరం, తెలంగాణలోని సోమశిల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. సిద్దేశ్వరం ప్రాజెక్టును గతంలో రెండుసార్లు వదిలేయడం వల్ల ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి పరిహారంగా ఈ వంతెనను ఆనకట్టగా మార్చాలని కోరుతున్నాం. రూ.350 కోట్లకు మించి వ్యయం కాదు. దిగువ ప్రాంతాల ప్రయోజనాలపై ప్రభావం పడదు. అధికార ప్రతిపక్షపార్టీలు స్పందించకపోవడంతో సిద్దేశ్వరం ఆనకట్ట కోసం ప్రజలను సమీకరించాల్సి వస్తోంది!”అని దశరథరామిరెడ్డి వెల్లడించారు.
‘‘సిద్దేశ్వరం కృష్ణా జలాల్లో మునిగిపోయింది. సాగు, తాగు నీటి కోసం ఎన్నో ఏళ్లుగా అల్లాడుతున్న రాయలసీమ ప్రజల ఆశలకు సమాధి. అసలు లేని సిద్దేశ్వరం కట్టని కట్టడంలా ఉంది. అన్యాయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రజలు ఇక్కడకు వస్తారు. న్యాయం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తారు ”అని కర్నూలుకు చెందిన న్యాయవాది కేసీ కల్కూర్ వివరించారు.

సిద్దేశ్వరం ఓ రాజకీయ సమిధ..
సిద్దేశ్వరం వద్ద బ్యారేజీ కట్టాలని ప్రభుత్వం పట్టుదలగా లేదు. ఎందుకంటే సీఎం జగన్మోహన్రెడ్డిని తన పూర్వీకుల మాదిరిగానే తన సొంత ప్రాంతానికి చెందిన నాయకుడిగా చూడడం ఇష్టం లేదు. రాయలసీమ మూలానికి చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా మనుగడ సాగించాలంటే కోస్తాంధ్ర నుంచి మద్దతు కీలకం. నీలం సంజీవ రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు అందరు ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో సేఫ్ గా ఆడారు.
కాబట్టి కోస్తా ఆంధ్రా నాయకులను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సొంత ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీయడానికి వెనుకాడరు’’ అని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖరశర్మ విమర్శించారు. కారణాలు ఏవైనా సీమ ప్రజల కన్నీటి ఆవేదనకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి.
credits : Jinka Nagaraju, The Federal.com
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
