ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్పొరేటర్ కొడుకు, సాదుద్దీన్ మాలిక్ కలిసి ఇద్దరు మైనర్ బాలికలను వేధించారు. వేధింపులు భరించలేక పబ్ నుంచి బయటకు వచ్చిన బాలికలను వెంబడించారు. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. ఇంటి వద్ద దించుతామని నమ్మించిన గ్యాంగ్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమెర్ఖాన్కు చెందిన బెంజ్ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు వెళ్లారు. బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి వెళ్లిపోతానన్న బాధిత బాలికను మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణం చేశారు. ఓ ఫోన్ కాల్ రావడంతో మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయాడు.
బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందంటూ కథలు అల్లారు. వెనుకాలే మరో ఇన్నోవాలో వస్తున్న వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడి కారులోకి బాలికను తరలించింది గ్యాంగ్. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.
గ్యాంగ్ రేప్ తర్వాత తిరిగి బేకరీకి చేరుకున్న నిందితుల్లో ఒకరు ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అనంతరం బేకరీ నుంచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కేసు నమోదుకాగానే హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఫాంహౌస్‌లో దాచిపెట్టారు.
Encourage Independent Journalism