కేసీఆర్ జాతీయ పార్టీ ఆంధ్రాలోనూ అడుగు పెడుతోంది. దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా కేంద్రీకరించే అవకాశాలున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ భేటీ అయినట్లు సమాచారం. ఇది ఏపీ రాజకీయ వర్గాల్లో ఎన్నో చర్చలకు తావిస్తోంది. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింత చీల్చడం ద్వారా జగన్‌కు ప్రయోజనమని కొందరు భావిస్తున్నారు. మరికొందరైతే అసంతృప్తి నేతలకు కేసీఆర్ పార్టీ వేదిక కల్పించడం ద్వారా జగన్ పుట్టి ముంచుతుందని అంచనా వేస్తున్నారు.
అధికార వైసీపీ వేసుకున్న సెల్ఫ్ గోల్స్‌తో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో సీఎం జగన్ కొందరు ఎమ్మెల్యేల పనితీరును ఆక్షేపిస్తూ ఈసారి టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనన్న సంకేతాలిచ్చారు.
అప్పటి నుంచి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై తోయడానికి సిద్దమయ్యారు. దీంతో వాళ్లు కూడా తమ రాజకీయ భవిష్యత్తు గురించి అన్ని దారులు వెతుకుతున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్లే అసంతృప్తివాదులతో కలిసి మూకుమ్మడిగా బయటపడాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ పార్టీ పగ్గాలు ఎవరికి ? వైసీపీ, టీడీపీలో గుబులు
ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీకి ముందుగా ఇక్కడ ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై విస్తృత చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ నుంచి ఉంటారా లేక టీడీపీ నుంచి వస్తారా అనేది స్పష్టత లేదు. రెండు పార్టీల్లోనూ ఈ గుబులు రేకెత్తిస్తోంది.
సహజంగా కొత్త పార్టీ వస్తే అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప ఎవరి ప్రయోజనాల కోసమో పనిచేయదు. అలాంటి సంకేతాలు వెళ్తే ఉత్తరాది పార్టీ మాదిరిగానే ఉంటుంది. అందువల్ల కేసీఆర్ ప్రజాభిమానం కలిగిన నేతకే పగ్గాలు అప్పజెప్పే అవకాశముంటుంది.
టీడీపీ, వైసీపీలోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తారని తెలుస్తోంది. రెండు పార్టీల నుంచి నాయకులు వచ్చినా కేసీఆర్ పెట్టే పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయి.. జగన్ సంక్షేమ పథకాలతో పోటీ పడతారా లేక సుస్థిర అభివృద్ధికి బాటలు వేసే మేనిఫెస్టో ఉంటుందా అనేది ఆ పార్టీ మనుగడను నిర్దేశిస్తోంది.
ఇక్కడ వైసీపీకి రిషీరాజ్సింగ్.. అక్కడ కేసీఆర్ పార్టీకి పీకే వ్యూహకర్తలుగా ఉన్నారు. ఇద్దరూ ఐ ప్యాక్ నుంచి వచ్చిన వాళ్లే. ఎవరి ఎత్తుగడలు వాళ్లకుంటాయా లేక ప్రభుత్వ వ్యతిరేకతను మరింత చీల్చి జగన్‌ను మళ్లీ అధికారానికి తెస్తారా అనేది కూడా చర్చనీయాంశమైంది.
వైసీపీ, టీడీపీ, జనసేనను బీజేపీ ఖాతాలో చూపగలరా !
ఏపీలో బీజేపీని చాలెంజ్ చేసే ప్రధాన పార్టీ లేని రాజకీయ శూన్యత ఉంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ వచ్చి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీ ఉపాంగాలని ప్రచారం చేయగలుగుతుందా ! ఈ మూడు పార్టీలను బీజేపీ ఖాతాలోకి నెట్టగలిగితే ప్రజలకు ప్రత్యామ్నాయం లభించినట్లే.
ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాల్లో తీవ్ర ఆక్రోశం నెలకొంది. ఈ సమయంలో సరైన సోషల్ ఇంజనీరింగ్‌తో కేసీఆర్ పార్టీ ముందుకొస్తే ప్రజలు ఆదరించే అవకాశాలున్నాయి. ఈనెల 19న కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారు. అదే రోజు ఆంధ్రా పగ్గాలు ఎవరికనేది తేల్చారంటే.. ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవచ్చు.
Contribute to telugillu
Encourage Independent Journalism
