ఒకే భాష.. ఒకే వ్యాపారం.. ఒకే పన్ను.. ఒకే నాయకుడు.. ఇదీ ప్రధాని నరేంద్ర మోడీతత్వం. సరిగ్గా ఇలాగే ఏపీలో కూడా ఒకే నాయకుడుగా చెలామణీ కావాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అధికార పీఠమెక్కిన దగ్గర నుంచి ఈ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. గల్లాపెట్టె దగ్గర పెట్టుకొని మీట నొక్కుడు పథకాలతో ప్రజలకు దగ్గర కావాలనుకున్నారు. మధ్యలో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలను చేశారు. వలంటీర్లు, కలెక్టర్లతో పాలన సాగించారు. దాని పర్యవసానం ఇప్పుడు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీ, జనసేన అధినేతల టచ్‌లోకి వెళ్తున్నారు.
వైసీపీకి కడప తర్వాత కంచుకోటలాంటి ప్రకాశం జిల్లాలోనే పార్టీ బీటలు వారుతోంది. ఇటీవల పార్టీ ప్లీనరీలో అసంతృప్తిని వెళ్లగక్కిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేన అధినేత పవన్‌ను కలిసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆయనే కాదు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. రాంబాబు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పటి నుంచి పవన్‌తో మంచి సంబంధాలున్నాయి. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనను మంత్రిగా కొనసాగించలేదని కువకువలాడుతున్నారు. తమ పార్టీ పెద్దనేత తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నట్లు బాహాటంగానే వెల్లడించారు.
పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలోనూ విభేదాలు తారా స్థాయికి చేరాయి. నిన్న కార్పొరేషన్ సమావేశంలో కార్పొరేటర్లు సిగపట్లకు దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శివప్రసాద్ పై ఈపాటికే రైవల్‌గా ముద్ర పడింది.
ప్రకాశం జిల్లా నుంచి కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం వెనుక అక్కడ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి హవా తగ్గింకచడానికనే ప్రచారం జరుగుతోంది. మహిధర్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే తూమాటి మాధవ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి ఇప్పుడు జనంలోకి పొమ్మంటున్నారు.
ఆది నుంచి సీఎం జగన్ పోకడలతోనే ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్లో ఆక్రోశానికి బీజాలు పడ్డాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హీరోలుగా ఫోకస్ అయితేనే ఆయన సీఎం అయిన సంగతి మరిచారు. దీనికి భిన్నంగా తనపై ప్రజల వీరాభిమానంతోనే ఎమ్మెల్యేలు గెలిచారనే అపోహలో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆయన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ప్రతీ సంక్షేమ పథకంతో వలంటీర్ల ద్వారా నేరుగా ప్రజాభిమాన్ని నిలుపుకోవాలని భావించారు.
పాలనలో పార్టీ భాగస్వామ్యాన్ని వదిలేసి సంక్షేమ జపానికే పరిమితం
ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. ఊరుమ్మడి సంక్షేమ పథకాలతోనే మళ్లీ విజయం సాధిస్తాననే ఆయన మితిమీరిన విశ్వాసం ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతోంది. ప్రజలపై వేస్తోన్న భారాలతో పోల్చుకుంటూ ఈ పథకాలెంతంటూ లబ్దిదారులు పెదవిరుస్తున్నారు. పథకాలు పొందని వాళ్లు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. కులాలవారీ ఉత్తుత్తి కార్పొరేషన్లతో ఒరిగేది ఏంటని నిలదీస్తున్నారు.
ప్రజల్లో వ్యతిరేకతకు ఎమ్మెల్యేలను బద్నాం చేయడంతో ఇప్పుడు ప్రజల్లోనే కాదు. పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఎన్నికల ముందు వరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్లను నిర్లక్ష్యం చేసినందుకు వాళ్లంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు.
ఈడీ ఉచ్చులో ఎమ్మెల్యేలు
అందుకే వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి భారీగా వలసలు వెల్లువెత్తుతాయని రాజకీయ విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 16 మంది ఎమ్మెల్యేలు క్యాసినోల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు అవకాశముందనే కోణంలో ఈడీ విచారిస్తోంది.
ఈడీ ఉచ్చు బిగిస్తే ఆ ఎమ్మెల్యేల పరిస్థితేమిటనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలన్నింటినీ కేంద్రంలోని కాషాయపెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. వైసీపీలో మొదలైన ముసలం ఎక్కడకు దారితీస్తుందోననే ఆందోళన వైసీపీ వర్గాల్లో నెలకొంది.
I have to thank you for the efforts you have put in penning this website. Im hoping to see the same high-grade content by you in the future as well. In truth, your creative writing abilities has motivated me to get my own website now 😉
Thanq very much. Continue support asusually