మన సంస్కృతీ సంప్రదాయాలను దేవాలయాల ద్వారా సుసంపన్నం చేయాల్సిన అవసరముందని యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఉప స్థపతి జే మోతీలాల్ వ్యక్తం చేశారు. ‘ధర్మం– ధర్మశాస్తం– సంస్కృతి’, ‘దేవాలయాల సంస్కృతీ సంప్రదాయాలు’ అనే అంశాలపై మహారాష్ట్ర రత్నగిరిలోని గోగేట్ జోగలేకర్ కాలేజీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో వైటీడీఏ ఉపస్థపతి మోతీలాల్ ప్రసంగించారు.
ఈ సదస్సును కవికులగురు కాళిదాస్ సంస్కృత విశ్వ విద్యాలయం, భారత రత్న డాక్టర్ పాండురంగా వామన్ కనే సంస్కృత కేంద్రం సంయుక్తంగా నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన సదస్సులో మోతీలాల్ మాట్లాడుతూ యాదగిరి గుట్ట యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్ గురించి వివరించారు.
సదస్సులో దేశ విదేశాల నుంచి 250 మంది స్కాలర్స్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముంబై నుంచి జస్టిస్ అంబదాస్ జోషి, న్యూఢిల్లీకి చెందిన వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి, డాక్టర్ కళాచార్య, లండన్ నుంచి ఫిలాసఫీ ప్రొఫెసర్ డాక్టరు మరియానో ఇటుర్బే, పూనే నుంచి ప్రొఫెసర్ సరోజ బటే, ఇటలీ నుంచి సైకాలజిస్టు పౌలో బరానే, వివిధ ప్రాంతాల నుంచి ఇంకా పలువురు ప్రొఫెసర్లు బీఆర్ శర్మ, రామరత్నం, రంజన నైగోవంకర్, మధుసూదన్ పెన్నా, లలిత సంజోషి పాల్గొన్నారు.