“ మేం అధికారానికి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలను రద్దు చేస్తాం. వలంటీర్ల వ్యవస్థను ఎత్తేస్తాం ! వేతనమిచ్చి జన్మభూమి కమిటీ సభ్యులను నియమిస్తాం !” అంటూ టీడీపీ కీలక నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించినట్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. వాస్తవానికి ఆయనలా వ్యాఖ్యానించలేదని కాల్వ శ్రీనివాసులు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. తనను, టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు తన పేరుతో ఇలాంటి వ్యాఖ్యలను ఎవరో ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.
