ఇడ్లీ
Idly
తెల్లని మల్లెపువ్వుల్లాంటి మెత్తటి ఇడ్లీలు మీ ఇంటి రుచి కోసం
The fluffiest white steamed cakes for a perfect morning
ఇడ్లీలు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం. పూర్వ కాలం నుండి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా వీటిని గుర్తిస్తారు. ఆవిరి మీద ఉడకడం వల్ల ఇవి సులభంగా అరుగుతాయి మరియు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఎంతో మంచిది.
Idly is the quintessential South Indian breakfast, revered for its health benefits and nutritional value. Historically originating in the Indian subcontinent, these fermented steamed cakes are oil-free and incredibly easy to digest. They have been a comforting staple in Indian households for centuries.
తయారి సమయం
8-10 hours fermentation
8-10 hours fermentation
వండే సమయం
10-12 minutes
10-12 minutes
పరిమాణం
4-5 Persons (approx 20 idlies)
4-5 Persons (approx 20 idlies)
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- మినప పప్పు Urad Dal (Skinless whole black gram) 1 cup
- ఇడ్లీ రవ్వ Idly Rava 2 cups
- ఉప్పు Salt 1 teaspoon
- నీరు Water (For soaking and grinding) 3 cups
తయారీ విధానం
-
మొదట మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.Wash the urad dal thoroughly and soak it in enough water for 4 to 5 hours.
-
మరొక గిన్నెలో ఇడ్లీ రవ్వను తీసుకుని అందులో నీళ్లు పోసి పక్కన ఉంచండి.In a separate bowl, take the idly rava, add water to it, and let it sit while you prep the dal.
-
నానిన మినప పప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి తక్కువ నీటితో మెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి.After soaking, drain the water from the urad dal and grind it in a mixer or grinder with minimal water until it becomes a smooth, fluffy paste.
-
ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వలోని నీటిని పూర్తిగా పిండేసి, ఆ రవ్వను రుబ్బిన మినప పిండిలో కలపాలి.Squeeze out all the excess water from the soaked idly rava by pressing it between your palms and add it to the ground dal batter.
-
ఈ మిశ్రమానికి ఉప్పు కలిపి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి.Add salt to the mixture and mix thoroughly until well combined.
-
మరుసటి రోజు ఉదయం పిండిని మెల్లగా కలిపి, అవసరమైతే కొద్దిగా నీరు చేర్చండి.Cover the bowl and allow the batter to ferment in a warm place for at least 8 hours or overnight.
-
ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని గుంతలలో పోయాలి.The next morning, gently stir the fermented batter. Add a tablespoon of water if the consistency is too thick.
-
ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి అయ్యాక, ఇడ్లీ ప్లేట్లను అందులో ఉంచి మూత పెట్టండి.Grease the idly plates with a tiny bit of oil or ghee and pour the batter into the molds.
-
మంటను మధ్యస్థంగా ఉంచి 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.Boil water in an idly steamer and place the plates inside once the steam starts to rise.
-
ఉడికిన తర్వాత ఐదు నిమిషాల ఆగి చెంచాతో మెల్లగా ఇడ్లీలను తీసి వేడిగా వడ్డించండి.Steam on medium heat for 10 to 12 minutes. Let it rest for a few minutes before de-molding with a wet spoon.