అమరావతి రాజధానితో అనుబంధం చాలా పెద్దది !
“ అన్నా ! అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా.. లేక మూడు రాజధానులు చేస్తారా ! పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి భూమి కొన్నానన్నా. రేట్లు పడిపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఏం జరుగుతుందో కొంచెం చెప్పండన్నా !” ఉదయాన్నే ఈ ఫోన్ కాల్తో నిద్ర మత్తు వదిలింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూమి రేట్లు పడిపోతే కొంపాగోడు అమ్మినా అప్పులు తీరవని మిత్రుడు వాపోయాడు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని చుట్టూ దేశ విదేశాల్లో…