టీడీపీలో ఐక్యతను పెంచిన వైసీపీ
రాజకీయాల్లో ఎత్తుగడలను లోతుగా అర్థం చేసుకోలేకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. విపక్షం రెచ్చగొడుతుంది. రెచ్చిపోతే అధికార పక్షానికే బొక్క పడుతోంది. ఇక్కడ అదే జరిగింది. టీడీపీ నేత సీఎం జగన్ను దుర్భాషలాడారు. జగన్ అభిమానులు రెచ్చిపోయి ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత 36 గంటలపాటు చేసిన నిరసన దీక్ష ఫలితాలనిచ్చింది. పార్టీలో లొసుగులను రూపుమాపి ఏకతాటిపైకి తెచ్చింది. పట్టాభి అన్న పదానికి సీఎం జగన్ విపరీత అర్థం చెప్పినా, జనాగ్రహ దీక్షలు చేపట్టినా…