కజ్జికాయలు
Roasted Gram Fried Dumplings
కరకరలాడే తీపి రుచుల విందు
Crispy Crescent Delights from South India
కజ్జికాయలు తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు తప్పనిసరిగా చేసే ఒక తీపి వంటకం. ముఖ్యంగా సంక్రాంతి, దీపావళి సమయాల్లో అమ్మమ్మలు చేసే ఈ తీపి వంటకం మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. వీటిని లోపల తీపి మిశ్రమంతో నింపి, నూనెలో వేయించి చేస్తారు.
Kajjikayalu is a classic deep-fried sweet snack from Andhra Pradesh and Telangana, traditionally prepared during major festivals like Sankranti and Diwali. It features a flaky, crispy shell stuffed with a delightful sweet mixture of coconut, sugar, and roasted grams, reminding many of cherished childhood visits to their grandparents’ homes.
తయారి సమయం
30 minutes
30 minutes
వండే సమయం
30 minutes
30 minutes
పరిమాణం
18-22 Pieces
18-22 Pieces
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- మైదా All Purpose Flour (Maida) 2 cups
- నెయ్యి Ghee (Clarified Butter) 2 tablespoons
- నీరు Water (for kneading) 1/2 cup
- ఉప్పు Salt 1 pinch
- ఎండు కొబ్బరి తురుము Desiccated Coconut(Dry Coconut) 1 cup
- చక్కెర Sugar (powdered) 1 cup
- వేయించిన పుట్నాల పప్పు Roasted Gram(Putnala Pappu) 1/2 cup
- యాలకుల పొడి Cardamom Powder 1 teaspoon
- గసగసాలు Poppy Seeds 2 tablespoons
- నూనె Cooking Oil (for deep frying) 2 cups
తయారీ విధానం
-
ఒక పాత్రలో మైదా పిండి, చిటికెడు ఉప్పు మరియు వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి.In a large mixing bowl, combine the all-purpose flour, a pinch of salt, and hot ghee. Mix well until the texture resembles breadcrumbs.
-
తగినంత నీరు కొద్దికొద్దిగా పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుని, అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టాలి.Gradually add water and knead it into a firm and smooth dough. Cover it with a damp cloth or lid and let it rest for 30 minutes.
-
స్టఫ్ఫింగ్ కోసం పుట్నాల పప్పును మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి.To prepare the stuffing, grind the roasted gram into a fine powder using a blender.
-
ఒక గిన్నెలో పుట్నాల పప్పు పొడి, ఎండు కొబ్బరి తురుము, చక్కెర పొడి, గసగసాలు మరియు యాలకుల పొడి వేసి బాగా కలపాలి.In a separate bowl, mix the roasted gram powder, desiccated coconut, powdered sugar, poppy seeds, and cardamom powder thoroughly.
-
నానబెట్టిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లాగా చాలా పలుచగా ఒత్తుకోవాలి.Take the rested dough, divide it into small equal-sized balls, and roll each ball into a very thin circular poori.
-
ఒత్తిన పూరీ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ స్టఫ్ఫింగ్ మిశ్రమాన్ని ఉంచాలి.Place a tablespoon of the prepared sweet stuffing in the center of the poori.
-
పూరీ అంచులకు కొద్దిగా నీటిని తడిపి, సగానికి మడిచి అంచులను గట్టిగా నొక్కాలి. కజ్జికాయల అచ్చు ఉంటే దానిని వాడవచ్చు లేదా ఫోర్క్ తో డిజైన్ చేయవచ్చు.Apply a little water along the edges of the poori, fold it into a semi-circle, and seal the edges firmly to prevent the stuffing from leaking.
-
బాణలిలో నూనె వేడి చేసి, మంటను మధ్యస్థంగా ఉంచి కజ్జికాయలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.You can use a kajjikayalu mold for perfect shapes or use a fork to press and create a decorative design along the edges.
-
నూనె నుండి తీసి పేపర్ టవల్ మీద వేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలకుండా డబ్బాలో భద్రపరుచుకోవాలి.Heat oil in a deep frying pan on medium flame. Carefully drop the prepared kajjikayalu and fry until they turn golden brown and crispy on both sides.