చెక్కలు
Chekkalu
టీ సమయానికి సరైన కరకరలాడే చిరుతిండి.
The ultimate crunchy tea-time companion.
చెక్కలు ఆంధ్రదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ పిండివంట. సంక్రాంతి వంటి పండుగల సమయంలో వీటిని తప్పనిసరిగా చేస్తారు. చిన్నప్పుడు ఇంట్లో చెక్కలు చేసేటప్పుడు వచ్చే ఆ సువాసన, పండుగ సందడి ఎప్పటికీ గుర్తిండిపోతాయి.
Chekkalu is a signature savory snack from Andhra Pradesh, often prepared during festivals like Sankranti. Growing up, the sound of the crackling dough being pressed and the aroma of deep-frying filled our homes, creating lasting memories of family gatherings and festive joy.
తయారి సమయం
20 minutes
20 minutes
వండే సమయం
40 minutes
40 minutes
పరిమాణం
20-25 crackers
20-25 crackers
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- బియ్యం పిండి Rice Flour 2 cups
- నానబెట్టిన శనగ పప్పు Soaked Chana Dal (1 hour) 2 tablespoons
- వెన్న Butter (At room temperature) 1 tablespoon
- అల్లం పచ్చిమిర్చి ముద్ద Ginger Green Chili Paste 1 tablespoon
- కరివేపాకు Curry Leaves (Finely chopped) 1 sprig
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
- వేడి నీళ్లు Hot Water (As needed for kneading) 1 cup
- నూనె Oil (For deep frying) 2 cups
తయారీ విధానం
-
ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండి, జీలకర్ర, అల్లం మిర్చి ముద్ద, నానబెట్టిన శనగ పప్పు, సన్నగా తరిగిన కరివేపాకు మరియు ఉప్పు వేసుకోడి.In a wide mixing bowl, add rice flour, cumin seeds, ginger-green chili paste, soaked chana dal, finely chopped curry leaves, and salt.
-
అందులో వెన్న వేసి పిండిని బాగా కలపండి, తద్వారా చెక్కలు గుల్లగా వస్తాయి.Add the butter to the flour mixture and crumble it with your fingers to ensure the Chekkalu turn out crisp.
-
తగినంత వేడి నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు.Gradually add hot water and knead into a stiff, non-sticky dough. Avoid making it too soft.
-
పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి.Cover the dough and let it rest for about 10 minutes.
-
చిన్న నిమ్మకాయ పరిమాణంలో పిండి ముద్దలను తీసుకుని ఉండలుగా చుట్టుకోండి.Divide the dough into small lemon-sized balls and roll them smoothly.
-
నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ లేదా అరటి ఆకు మీద ఒక ఉండను ఉంచి, వేళ్లతో పల్చటి బిళ్ళల్లా ఒత్తుకోవాలి.Place a ball on a greased plastic sheet or a banana leaf and flatten it into a thin disc using your fingers.
-
బాండీలో నూనె పోసి బాగా వేడి చేయండి.Heat oil in a deep frying pan over medium-high heat.
-
నూనె వేడెక్కిన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచి, తయారుచేసుకున్న చెక్కలను జాగ్రత్తగా నూనెలో వేయాలి.Once the oil is hot, carefully slide the prepared discs into the oil without overcrowding the pan.
-
రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి, నూనె నుండి తీసి ఆరనివ్వాలి.Deep fry on medium flame until they turn golden brown and the bubbles in the oil subside.
-
పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలకుండా డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి.Drain them on paper towels and let them cool completely before storing in an airtight container for lasting freshness.