అల్లం టీ
Ginger Tea
మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించే ఘాటైన అల్లం టీ!
A zesty and refreshing Indian classic to jumpstart your day!
భారతీయ ఇళ్ళలో అల్లం టీ ఒక ప్రధానమైన పానీయం, ముఖ్యంగా వర్షాకాలంలో లేదా చలికాలంలో దీనికి డిమాండ్ ఎక్కువ. ఇది గొంతు నొప్పికి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మా అమ్మమ్మ రోకలితో తాజా అల్లాన్ని దంచుతుంటే ఆ ఘాటైన సువాసన ఇల్లంతా వ్యాపించేది.
Ginger tea is a staple in Indian households, especially during the rainy season or cold winters. Known for its medicinal properties, it’s the perfect remedy for a sore throat or a tired mind. I remember my grandmother always crushing fresh ginger in a mortar and pestle, filling the kitchen with its spicy aroma.
తయారి సమయం
5 minutes
5 minutes
వండే సమయం
10 minutes
10 minutes
పరిమాణం
2
2
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- నీళ్లు Water 1.5 cups
- అల్లం ముక్క Ginger piece (Freshly crushed) 1 inch
- టీ పొడి Tea powder 2 teaspoons
- పాలు Milk 1 cup
- చక్కెర Sugar(Adjust to taste) 3 teaspoons
తయారీ విధానం
-
ఒక గిన్నెను మధ్యస్థ మంట మీద ఉంచి అందులో నీళ్లు పోయండి.Place a saucepan on medium heat and add the water.
-
నీళ్లు వేడెక్కుతున్నప్పుడు, తాజా అల్లం ముక్కను శుభ్రంగా కడిగి రోకలితో బాగా దంచండి.While the water is heating, wash the fresh ginger and crush it thoroughly using a mortar and pestle to release its juices.
-
మరుగుతున్న నీళ్లలో ఈ అల్లం ముద్దను వేసి, నీరు కొద్దిగా పసుపు రంగులోకి మారే వరకు రెండు నిమిషాలు మరగనివ్వండి.Add the crushed ginger to the boiling water and let it simmer for two minutes until the water turns slightly yellowish.
-
అల్లం రసం దిగిన నీటిలో టీ పొడిని వేసి మరో నిమిషం పాటు ఉడికించండి.Add the tea powder to the ginger-infused water and continue to boil for another minute.
-
ఇప్పుడు పాలు మరియు మీ రుచికి తగినంత చక్కెరను కలపండి.Pour in the milk and add the sugar according to your taste preferences.
-
టీ బాగా పొంగి వచ్చే వరకు మరిగించి, ఆపై మంటను తగ్గించి మరో రెండు మూడు నిమిషాల పాటు చిక్కని రంగు వచ్చేవరకు ఉంచండి.Let the tea come to a rolling boil, then lower the heat and simmer for another two to three minutes until it reaches a rich brown color.
-
టీని వడకట్టి వేడివేడిగా కప్పుల్లోకి సర్వ్ చేయండి.Strain the tea into cups using a fine mesh strainer and serve hot.