వెజిటబుల్ సూప్
Healthy Garden Vegetable Soup
ప్రకృతి ప్రసాదించిన పోషకాలతో కూడిన వేడి వేడి సూప్.
A warm hug in a bowl, packed with nature's goodness.
వెజిటబుల్ సూప్ శతాబ్దాలుగా అనేక సంస్కృతులలో ప్రధాన ఆహారంగా ఉంది. చలికాలంలో లేదా వర్షం పడేటప్పుడు మా అమ్మ మాకు ఆరోగ్యం కోసం ఇలాంటి వేడి సూప్ చేసి ఇచ్చేవారు. ఇది జీర్ణక్రియకు మరియు రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది.
Vegetable soup has been a staple in many cultures for centuries, evolving from simple broths to nutrient-dense meals. I remember my mother making this on rainy evenings to keep us warm and healthy. It is light, refreshing, and perfect for any season.
తయారి సమయం
10 minutes
10 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
2
2
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- క్యారెట్ ముక్కలు Carrot (finely chopped) 1 cup
- బీన్స్ ముక్కలు French Beans (finely chopped) 1/2 cup
- స్వీట్ కార్న్ Sweet Corn 1/2 cup
- క్యాబేజీ తరుగు Cabbage (finely shredded) 1/2 cup
- వెన్న Butter 1 tablespoon
- అల్లం వెల్లుల్లి తరుగు Ginger Garlic (finely chopped) 1 tablespoon
- మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
- నీళ్లు Water 4 cups
- ఉప్పు Salt 1 teaspoon
- మొక్కజొన్న పిండి Cornflour (mixed with 2 tablespoons water) 1 tablespoon
- కొత్తిమీర తరుగు Coriander Leaves (chopped) 1 tablespoon
తయారీ విధానం
-
ఒక పాన్ తీసుకుని అందులో వెన్న వేసి కరిగించండి.Heat butter in a large pan or pot over medium heat.
-
కరిగిన వెన్నలో సన్నగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.Add the finely chopped ginger and garlic, sautéing until they turn fragrant.
-
ఇప్పుడు క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ మరియు క్యాబేజీ తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.Incorporate the chopped carrots, beans, sweet corn, and cabbage, and sauté for two to three minutes.
-
నాలుగు కప్పుల నీళ్లు పోసి కూరగాయ ముక్కలు మెత్తబడే వరకు మధ్యస్థ మంట మీద మరిగించండి.Pour in the water and bring the mixture to a boil until the vegetables are tender.
-
రుచికి తగినంత ఉప్పు మరియు మిరియాల పొడిని చేర్చండి.Season with salt and black pepper powder according to your taste.
-
సూప్ చిక్కగా ఉండటం కోసం నీళ్లలో కలిపిన మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలపండి.Slowly pour in the cornflour slurry while stirring continuously to achieve a thick consistency.
-
సూప్ కావలసినంత చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.Let the soup simmer for another minute until it reaches the desired thickness.
-
చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి గా వడ్డించండి.Garnish with freshly chopped coriander leaves and serve hot.