అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా !
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై అనేక విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఊహాగానాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఇదంతా బీజేపీ ఎత్తుగడలో భాగమే. తమకు అన్ని విధాలా సహకరించే మిత్రులున్న చోట కూడా బీజేపీ బలపడాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయనే సర్వేలు వస్తున్నాయి. దీనికి తోడు బీహార్ పరిణామాలతో బీజేపీ సొంతంగా బలోపేతం కావడానికి పావులు కదుపుతోంది. అందులో భాగంగానే సినిమా స్టార్లకు వల విసురుతోంది….