వైసీపీ దగాకోరు పాలనపై బీజేపీ ప్రజా ఉద్యమం
గడచిన మూడేళ్ల నుంచి వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించిదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారు వైఫల్యాలపై బీజేపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పోరు సభలు నిర్వహిస్తామన్నారు. పోరు సభల్లో కేంద్రం ఏపీకి ఇచ్చిన సాయం గురించి ప్రచారం చేస్తామన్నారు. నేటికీ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందకుంటే పూట గడవని రాష్ట్ర…