కొత్త మంత్రులతో ఒరిగేదేంటీ !
పాత మంత్రులు రాజీనామా చేశారు. సీఎం జగన్ ముందుగా చెప్పినట్లు రెండున్నరేళ్ల తర్వాత కొత్త మంత్రి వర్గం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. కులాల వారీ అంక గణితాలు మొదలు పెట్టారు. రెండు రోజుల్లో కొత్త ముఖాలేవో తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తుందేమంటే.. ఇప్పటిదాకా ఉన్న మంత్రులు సాధించింది ఏమిటి? రేపు కొలువుదీరే మంత్రులు ప్రజలకు ఒరగబెట్టేదేమిటనేది చర్చనీయాంశమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదట మంత్రి వర్గ కూర్పులో సామాజిక సమతుల్యత సాధించారని సర్వత్రా పొగడ్తలు…