ఈ చిన్నోడి ఆశ నెరవేరేదెన్నడు !
‘ నీ పళ్లు అంత గార పట్టాయి ఏంటీ!’అనగానే.. ఏం చేస్తాం అన్నా!ఫ్లోరిన్ వల్ల అలా గార పట్టాయి.మాకు ఏళ్ల సందిటి మంచి నీళ్లు లేవు. ఫ్లోరిన్ నీళ్లే గతి.జగనన్నను అడుగుదామని వచ్చా సార్.నన్ను అన్నకు కలిపించరా ! అని అడిగాడు.పదిపన్నేండేళ్లు కూడా లేని ఆ బుడతడిసామాజిక స్పృహ అబ్బుర పరిచింది. నాలుగేళ్ల క్రితం నాటి ఘటన.వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.అది పొన్నలూరు మండలం తిమ్మ పాలెం.గ్రామ సమీపాన ఏర్పాటు చేసిన…