పరిస్థితులు ఇలాగే ఉంటే ‘ముందస్తు’ తప్పదేమో !
“ ఏపీలో ఇవే ఆర్థిక పరిస్థితులుంటే సంక్షేమ పథకాలు కొనసాగించడం కష్టం. అనివార్యంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముంది !” అంటూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈనెల ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పించన్లు ఇవ్వకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాల అడుగులు కూడా ముందస్తు ఎన్నికలకేనన్నట్లు తెగ హడావుడి చేసేస్తున్నాయి. ఈనెల 15 నుంచి పీకే బృందం…